ఉత్తరప్రదేశ్‌లో దీపోత్సవ్ 2023 ఏడవ ఎడిషన్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని యూపీ సర్కార్ చూస్తోంది.
ఢిల్లీ- గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీపావళి పండగ సందర్భంగా నగర వాసులు సొంత ఇళ్లకు బయలు దేరడంతో ట్రాఫిక్ భారీగా పెరిగింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య భారత్- అమెరికాల 5వ ‘టూ ప్లస్ టూ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో ఇరు దేశాలు ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు తెలిపాయి.
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై నిన్న (శుక్రవారం) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో అక్కడిక్కడే నలుగురు మరణించారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్‌లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొట్టుకోవడంతో నలుగురు మరణించారు. ఇక, ఈ ప్రమాదంలో 60 మందికి గాయాలు అయ్యాయి.
ప్రధాని మోడీ టూర్ పర్యటన దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటకాం కలగకుండా ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పలు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.
గాజా భవిష్యత్తుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను ఆక్రమించడం మా టార్గెట్ కాదు.. అక్కడ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితిని సృష్టిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
నా ఉద్యోగి జయ ప్రకాష్ నీ కొట్టారు.. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు.. వంటి కాలు మీద చైర్ లో నిలబెట్టారు.. ఒప్పుకోవాలని బలవంతం చేశారు అని ఆయన వెల్లడించారు. ఐటీ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.