Malicious Calls: టెలికామ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నమంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి *401# టైప్ చేసి మేము సూచించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డయల్ చెయ్యండి అని సైబర్ నేరగాళ్లు కోరుతున్నారు. మీ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరైనా కాల్ చేసి చెబితే.. తొందరపడకండి.. అలా చెయ్యమని ఏ టెలికామ్ సంస్థ మిమ్మల్ని కోరదు అని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పేర్కొనింది. సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు.
Read Also: Union Minister Kishan Reddy: వేగంగా రైల్వేల అభివృద్ధి.. 2.94 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాం..
ఒక వేళ సదరు అపరిచిత వ్యక్తి చెప్పినట్టుగా *401# తర్వాత గుర్తు తెలియని నంబర్ ఎంటర్ చేసి డయల్ చేస్తే ఇక అంతే సంగతి అనుకోండి. మీ సిమ్‌కు రావాల్సిన ఫోన్ కాల్స్ ఆ గుర్తు తెలియని నంబర్‌కు వెళ్లేందుకు అవసరమైన కాల్ ఫార్వార్డ్‌కు మీరు పర్మిషన్ ఇచ్చినట్లే తెలుస్తుంది. ఇక, ఆ కాల్స్‌ను రిసీవ్ చేసుకున్న వాళ్లు వాటితో ఈజీగా మోసాలకు పాల్పడతారు. ఈ *401# నెంబర్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టెలికామ్ శాఖ ఓ హెచ్చరిక జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పింది. వినియోగదారులు తమ ఫోన్ సెట్టింగ్స్‌లో కాల్ ఫార్వార్డింగ్ ఆప్షన్ ఇనేబుల్‌లో ఉంటే వెంటనే డిసేబుల్ చేసుకోవాలని పేర్కొనింది.