ఈ నెల 7వ తారీఖున జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కర్నూలు పర్యటనలోనే జగనన్న విద్యా దీవెన డబ్బులను సీఎం జగన్ రిలీజ్ చేయనున్నారు.
తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వాచనం అందజేసి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టిన నేను.. అంచెలంచెలుగా ఏదుగుతూ వచ్చాను అని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా కొనసాగుతుంది. క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉంన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరి కొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త ఇనిషియేటివ్.. పోలీసు అధికారుల పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకుని అమరావతికి రానున్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నారు అని దానికి పోలీసులు సహకరిస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలంగాణ బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కి కిషన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు కలిశారు. సైలెంట్ పీరియడ్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాయిలేట్ చేశారని కంప్లయింట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.. సైలెంట్ పీరియడ్ లో రాజకీయ నాయకులు మాట్లాడొద్దని చట్టం ఉంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పలు కంప్లైంట్స్ వచ్చాయని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. డీఈఓ రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేస్తారు.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 26 గేట్లలో చెరి 13 గేట్ల దగ్గర పోలీసుల పహారా కొనసాగుతుంది. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైపు వాహనాలు రాకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు.