తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది అని రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము.. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం.. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి.. జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై డీఈఓ ను రిపోర్ట్ అడిగామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పలు కంప్లైంట్స్ వచ్చాయని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. డీఈఓ రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేస్తారు.. రూరల్ ఏరియాల్లో పోలింగ్ శాతం భాగానే ఉంది.. ఇప్పటి నుంచి ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నాం.. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుందని వికాస్ రాజ్ చెప్పుకొచ్చారు.