తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు కలిశారు. సైలెంట్ పీరియడ్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాయిలేట్ చేశారని కంప్లయింట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.. సైలెంట్ పీరియడ్ లో రాజకీయ నాయకులు మాట్లాడొద్దని చట్టం ఉంది.. గుళ్లను, ప్రార్థనా మందిరాలను రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు వాడుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఓటు వేసి ఓటర్లను ప్రలోబా పెట్టెలాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు అని సోమా భరత్ పేర్కొన్నారు.
Read Also: Telangana Elections: రేవంత్ రెడ్డి సోదరుడుని అరెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని సోమా భరత్ తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలపై సీఈఓ, ఈసీఐకి ఫిర్యాధు చేశాం.. కేటీఆర్ పేరుతో A1 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కేటీఆర్ పేరుతో తప్పుడు ప్రచారం చేయబోతున్నారని డీజీపీకి ముందుగానే ఫిర్యాధు చేసాము.. మేము చేసిన గంటకే ఫేక్ వీడియో బయటకు వచ్చింది అని బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో నేరాలు చేసే నాయకులు ఎక్కువగా ఉన్నారు.. రేవంత్ రెడ్డికి తెలిసే ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయి.. సైలెంట్ పీరియడ్ ను రేవంత్ రెడ్డి వాయిలెట్ చేశారంటూ కంప్లైంట్ లేటర్ లో తెలిపారు.