భారత్- మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య పాత స్నేహానికి తెర పడుతుంది. మహ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవుల్స్ ఆరు దశాబ్దాల వెనుకబడి పోయింది. 1965లో బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన మాల్దీవులకు స్వతంత్ర దేశ హోదాను ఇచ్చిన మొదటి దేశం భారతదేశం.. అయితే, 1980లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల.. చైనా 2011లో మాల్దీవులలో తన దౌత్య కేంద్రాన్ని ప్రారంభించింది. అయితే చైనా మాల్దీవులతో స్నేహం చేసిన వెంటనే.. మాల్దీవులు- భారతదేశం మధ్య సంబంధాలు క్షీణించడం స్టార్ట్ అయ్యాయి.
Read Also: Shivam Dube: చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మైదానంలో బాగా ఎంజాయ్ చేశా!
ఇక, నవంబర్ 2013లో అబ్దుల్లా యమీన్ మాల్దీవుల కొత్త అధ్యక్షుడయ్యాడు. యమీన్ చైనా వైపు మొగ్గు చూపాడు. ఆయన ప్రభుత్వ హయాంలో చైనా దౌత్యం వర్ధిల్లింది. కానీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చైనా మాలెలో భారీగా డబ్బు ఖర్చు చేసి అభివృద్ధి పేరుతో మాల్దీవులపై భారీ అప్పులు చేసింది. దీంతో అంగోలా, జిబౌటి తర్వాత చైనాకు మాల్దీవులు మూడవ అతిపెద్ద రుణగ్రహీతగా మారింది. ఈ చిన్న ద్వీపం దేశం దాని జీడీపీలో దాదాపు 30 శాతానికి సమానమైన మొత్తంలో చైనాకు రుణపడి ఉంది. ఇక, ఆర్థికవేత్తగా పేరొందిన అధ్యక్షుడు యమీన్ నిర్ణయాల కారణంగా మాల్దీవుల్లో భారీ నిరసనలు మొదలయ్యాయి. చైనా స్ఫూర్తితో కూడిన విధానాన్ని తిరస్కరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. యమీన్ ప్రభుత్వం అందుకు నిరాకరించడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Ram Mandir : రామ మందిర ప్రారంభోత్సవం.. ప్రమిదలకు భారీగా పెరిగిన డిమాండ్
అయితే, చైనాను నిశితంగా గమనిస్తూ వచ్చిన భారతదేశం అనేక సంవత్సరాలుగా మాల్దీవులలో సైనిక సహాయం, శిక్షణతో పాటు “సామర్థ్య నిర్మాణం”లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఫాస్ట్-అటాక్ క్రాఫ్ట్‌ను బహుమతిగా ఇవ్వడమే కాకుండా, మాల్దీవుల జాతీయ రక్షణ దళాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం ఆరుగురు పైలట్‌లతో పాటు 12 మందికి పైగా సైనికులను నియమించింది. ఇప్పటికి దాదాపు 25,000 మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. వారు మాల్దీవులను అందంగా తీర్చిదిద్దడంలో నిమగ్నమై ఉన్నారు. భారతీయ సమాజానికి చెందిన వ్యక్తులు వైద్యులు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, మేనేజర్లు, ఇంజనీర్లు, నర్సులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. ఈ భారతీయ నిపుణుల సంఘం మాల్దీవుల రాజధాని మాలేలో నివసిస్తున్నారు.