భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ బయోటెక్ వ్యవస్థాపకుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీతో పాటు విజయ్ మాల్యాలను భారత్‌కు తీసుకురావడానికి భారత దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి.
తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.
సిరియా, నార్తన్ ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు దిగింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ఏరియాలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణిలతో దాడులు చేసింది.
ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమె గుట్కా తీసుకుంది. ఇక, ఈ విషయం తెలిసిన భర్త శివకుమార్.. గుట్కా కావాలంటే తనను అడగొచ్చు కదా? అని పూజను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది
దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది.. ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.