Gurpatwanta Singh Panon: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భగవంత్ మాన్‌ను చంపేస్తానని హెచ్చరించాడు. జనవరి 26న ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ తెలిపాడు. సీఎంతో పాటు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్‌కు కూడా ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు.
Read Also: Dead Body in Sack: రంగారెడ్డిలో దారుణం.. గోనె సంచిలో మృతదేహం..
ఇక, ఖలిస్తానీలు, గ్యాంగ్‌స్టర్లపై నిరంతర చర్యలు తీసుకోవడం వల్ల పన్ను ఇతర గ్యాంగ్‌స్టర్లు అలాగే, ఖలిస్తానీ మద్దతుదారులు భయాందోళనలకు గురయ్యారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు బెదిరింపులు రావడమే ఇందుకు ఉదాహరణ.. గ్యాంగ్‌స్టర్‌లతో పాటు ఖలిస్తానీ ఉగ్రవాదులపై పంజాబ్ పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించారు. గత కొంతకాలంగా వీరిపై పోలీసులు కఠినమై చర్యలు తీసుకుంటున్నారు. ఇక, జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రభుత్వాన్ని బెదిరించిన వారం తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.
Read Also: The Raja Saab: ఆ కటౌట్ కి ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేయాల్సిందేలే…
అయితే, రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను ముస్లిం ప్రజలు కూడా వ్యతిరేకించాలని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కోరారు. అయితే, భారత ప్రధాన మంత్రి నరేందవ్ర మోడీ ‘ముస్లింలకు ప్రధాన శత్రువు’ అని ఖలీస్తాన్ ఉగ్రవాది పన్ను పేర్కొన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. బలవంతంగా మతం మార్చబడిన వేలాది మంది ముస్లింల మృతదేహాలపై ఈ ఆలయాన్ని నిర్మించారని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వెల్లడించారు.