ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, గృహసారథులు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోనున్న సీఎం జగన్ భీమిలీ సంగివలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన మాటమంతి నిర్వహిస్తారు.
Read Also: Viral Video : తాతోయ్.. నీ ఐడియా అదుర్స్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
అయితే, ఉత్తరాంధ్రలోనే వైసీపీ ఎన్నికల శంఖారావం నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సభాప్రాంగణం వెనుక నుంచి జగన్ కాన్వాయ్ రావడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అలాగే, సభాప్రాంగణం చదును, హెలిప్యాడ్ ను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీంతో ఈ సభ ద్వారా వైసీపీ ఎన్నికల శంఖారావం ప్రకటించనుంది.