హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నగరంలో పలు చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. నేటి తెల్లవారుజాము నుంచే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ పూజ్య గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీ శంకుస్థాపన చేశారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, ఇవాళ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భార్య కల్పనా సోరెన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది.
జపాన్లో ఇటీవల రికార్డు స్థాయి హిమపాతం మొదలు కావడంతో అరుదైన కిల్లర్ వేల్స్ (Arkas)కు ప్రాణాల మీదకు వచ్చింది. ఉత్తర జపాన్లోని హక్కైడో తీరంలో గల రౌస్ అనే ప్రదేశానికి కిలో మీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకున్నాయి.
షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం, గుర్తును ఈసీ కేటాయించింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల విజయాన్ని పాకిస్తాన్లోని అన్ని రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, అవినీతి, పన్నుల నుంచి విముక్తి కల్పిస్తామని 2014లో నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానం చేశారు. అప్పుడు భారత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
భారత్లో ఎన్నికల వాతావరణం మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు తుది తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించలేదు.. ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది అనే తప్పుడు వార్తను ఈసీ ఖండించింది.