2024వ సంవత్సరంలో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్. ఫ్లై (Layoffs.fyi) డేటాలో వెల్లడించింది. తాజాగా స్నాప్ ఇన్ (Snap Inc) కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540) తొలగించినట్లు ప్రకటించింది. దీంతో పాటు ఓక్టా ఇన్(Okta Inc ) సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే.. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను (400 ) విధుల నుంచి తొలిగిస్తున్నట్ల ప్రకటించింది.
Read Also: King Charles III: బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్..
అయితే, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఈ ఏడాది ప్రారంభం నుంచి సిబ్బందిని తొలగిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించుకోవడం వల్లే ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) వినియోగిస్తుండటం వల్ల.. ఇందులో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానే చాలా కంపెనీలు సుముఖత చూపుతున్నాయి. దీని వల్ల కొత్త నియామకాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులను కూడా టెక్ పరిశ్రమలు ఇంటికి పంపిస్తున్నాయి.
Read Also: Uttarakhand: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలోకి యూసీసీ బిల్లు
ఇక, వరుస లేఆఫ్స్ తో టెక్కిలు భయందోళనలో గురి అవుతున్నారు. ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన లేదా ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెక్నాలజీలో నైపుణ్యాని కలిగి ఉన్న ఉద్యోగులకు అధిక డిమాండ్ ఉంది. ఈ కారణంగానే గత డిసెంబర్ నుంచి జనవరి వరకు పలు కంపెనీలు కొత్త టెక్నాలజీపై నైపుణ్యం కలిగి ఉన్న 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 17, 479కి చేరినట్లు సమాచారం.