YSR Kadapa district: నేడు పులివెందుల, ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Y.S. Jagan Mohan Reddy ) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఇక, సీఎం పర్యటన వివరాలు ఇలా..
• నేటి ఉదయం 10. 20 కడప ( Kadapa ) ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకోనున్నారు.. అక్కడి నుంచి 10.25 గంటలకు హెలికాప్టర్లో బయలు దేరి 10.40 పులి వెందులలోని భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఇక, 10.45 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి 10.55 గంటలకు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.35 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 11.35 గంటలకు రోడ్డు మార్గాన బయలు దేరి 11.45 గంటలకు బనాన ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుని.. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ఉండనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.10 గంటలకు డాక్టర్
వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని.. 12.25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం గడపనున్నారు.
Read Also: Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్‌లో త్రిష.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరు..
• ఇక, మధ్యాహ్నం 12.25 గంటల నుంచి 12.35 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ( YSR ) జంక్షన్ ను ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.. 12.35 నుంచి 12.40 వరకు సెంట్రల్బోలే వార్డు ప్రారంభిస్తారు.. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.50 గంటలకి వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకొని ఒంటి గంట వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.05 గంటలకు గాంధీ జంక్షన్ చేరుకొని 1.10 వరకు జంక్షన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 1.15 డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకొని 1.40 వరకు దాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.50కి ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకోనున్నారు. 2.05 గంటల వరకు ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్-1ను సీఎం జగన్ ( CM Jagan ) ప్రారంభించనున్నారు.
Read Also: Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?
• అలాగే, 2.15కు సమ్యూ గ్లాస్ హెలిప్యాడ్ దగ్గర నుంచి సీఎం జగన్ బయలుదేరి.. 2.25కు ఇడుపులపాయ ( Idupulapaya ) హెలిప్యాడ్ కు చేరుకుంటారు.. 2.30 గంటలకి రోడ్డు మార్గాన వెళ్తుూ.. 2.35కు వైఎస్ ఆర్ మెమోరియల్ పార్క్ దగ్గరకు చేరుకుంటారు. 2.55 వరకు పార్క్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉంటారు. అ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యహ్నం 3.00 గంటలకు గెస్ట్ హౌస్ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు రెస్ట్ తీసుకుంటారు. ఇక, సాయంత్రం 4 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి బయలేదేరి 4.05 ఇడుపుల పాయ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. 4.10కి అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలు భోదేరిలో 4.25గంటలకు సీఎం జగన్ కడప ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 4.35కు కడప ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి 5.25కు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. అలాగే, 5.30గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన 5.50కి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకోనున్నారు.