నేడు డీసీసీబీ చైర్మన్ బల పరీక్ష జరగనుంది. వైస్ చైర్మన్ సహా మెజార్టీ సభ్యుల తిరుగుబాటు చేశారు. అవిశ్వాస పరీక్షకు ముందు డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు.
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నేతీ చెందంలాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారు
వరంగల్ జిల్లాలో పలు ఆసుపత్రులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన నర్సంపేట రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగిన ఆర్ఎంపీ, పీఎంపీల ప్రథమ మహా సభలో పలువురు వైద్యులు, జాతీయ- రాష్ట్ర వైద్య మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మెడికల్ కౌన్సిల్ ఆరోపించింది.
ఇవాళ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాను కౌగిలించుకున్నాడు. అయితే, నిన్న రోహిత్ ఎంఐ టీమ్ తో చేరాడు.. ఈ సందర్భంగా ఇవాళ తన మొదటి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా రోహిత్ వద్దకు వెళ్లి అతడ్ని కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం- జనసేన- భారతీయ జనత పార్టీ (ఎన్డీయే) కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
ఐపీఎల్ 2024కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీమ్ పేసర్, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లే ఈ టోర్నమెంట్ ఫస్టాప్ మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు.
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడుకి సంబంధించిన కేవీఆర్ సూపర్ మార్ట్ లో భారీ మొత్తంలో చీరలు ఉన్నాయని ఎన్నికల అధికారికి టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్లో మెజార్టీ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినఘనత జగన్ దే అని తెలిపారు. జగన్ ను మరో రెండు సార్లు గెలిపించుకోవాల్సి ఉంది.. జగన్ ఓ సంఘ సంస్కర్త అంటూ ఎంపీ ఆర్. కృష్ణయ్య కొనియాడారు.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్- 2024 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చె న్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న జరుగనుంది.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొత్త పాటను ఇవాళ రిలీజ్ చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట "సన్‌రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో.." అంటూ స్టార్ట్ అవుతుంది.