ఐపీఎల్ 2024కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీమ్ పేసర్, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లే ఈ టోర్నమెంట్ ఫస్టాప్ మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని స్వయంగా లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లంగర్ పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్ టీ20తో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడిన విల్లే.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండబోతున్నాడు.
Read Also: PM Modi Bhutan Visit: ప్రధాని మోడీ భూటాన్ దేశ పర్యటన వాయిదా..
ఇక, గత రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన డేవిడ్ విల్లేను ఈ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్.. 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అయితే, ఇప్పుడు విల్లే 17వ సీజన్ ఫస్ట్ షెడ్యూల్‌కు మాత్రం దూరంగా ఉండబోతున్నాడు. రెండ్రోజుల క్రితమే పీఎస్‌ఎల్ ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడిన విల్లే.. అక్కడి నుంచి నేరుగా బ్రిటన్ కు వెళ్లిపోయాడు. విల్లే రెండో షెడ్యూల్ వరకైనా తిరిగొస్తాడా..? లేక సీజన్ మొత్తానికి దూరమవుతాడా..? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. లక్నో కూడా డేవిడ్ విల్లే రిప్లేస్‌మెంట్‌ను ఇంకా ప్రకటించలేదు.
Read Also: Samantha Remuneration: వెబ్ సిరీస్ కోసం సమంత షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?
అయితే, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లో ఆడుతూ ఈ సీజన్‌కు దూరమైన రెండో పేసర్ డేవిడ్ విల్లే.. అంతకుముందు మరో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ సైతం ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం అతడు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ మెగ ఈవెంట్ కు దూరంగా ఉంటున్నాడు. కాగా, మార్క్ వుడ్‌తో పాటు ఈ సీజన్ నుంచి జేసన్ రాయ్, గస్ అట్కిన్సన్ (ఇద్దరూ కేకేఆర్), హ్యారీ బ్రూక్ (ఢిల్లీ) లు ఇప్పటికే పలు కారణాలతో దూరమయ్యారు. ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి ఒక్కొక్కరుగా ఇంగ్లాండ్ ప్లేయర్లు దూరం అవుతున్నారు.
Justin Langer has revealed that David Willey will not be available for LSG at the start of #IPL2024
Full story: https://t.co/nQdHpfGE3N pic.twitter.com/uSoz9bm6l6
— ESPNcricinfo (@ESPNcricinfo) March 20, 2024