ఇన్స్టాగ్రామ్ సేవలు ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి నిలిచిపోయినట్లు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్. కామ్ తెలిపింది. దాదాపు 70 శాతం లాగిన్ సమస్యలను చూపిస్తుంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌కు వెళ్లారు. ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే ప్రధాని మోడీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో బయలు దేరారు.
కేజ్రీవాల్‌ను ఇవాళ ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. విచారణ కోసం ఈడీ ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. దాదాపు 13 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది.
ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది.
ఇవాళ (గురువారం) ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది.
మా అభ్యర్థిపై దాడి చేసి మా పైనే కేసులు పెడుతున్నారు అని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ పెమ్మసాని తెలిపారు.
గన్నవరంలో ప్రముఖ న్యాయవాది కేవీ రమణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారు.
హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కుమారుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.