ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ కొనసాగుతుంది. అయితే, ప్రస్తుత సీజన్‌లో మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటి వరకు ఆ జట్టు 5 టైటిల్స్ సాధించింది. కెప్టెన్సీ మార్పు ప్రభావం ఈ సీజన్‌లో జట్టు ప్రదర్శనపై కనిపించే అవకాశం ఉంది. అయితే, రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసినప్పటి నుండి ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు ఆటగాళ్ల మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు రోహిత్, హార్దిక్ మధ్య అంతా బాగానే ఉందని తెలుస్తోంది. వాస్తవానికి, ముంబై ఇండియన్స్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Read Also: Jaishankar: “నెహ్రూ అమెరికా వ్యతిరేకి”.. కాంగ్రెస్ విదేశాంగ విధానంపై జైశంకర్..
ఇక, తొలి ప్రాక్టీస్ సెషన్స్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత సారథి హర్థిక్ పాండ్య కలుసుకోవడంతో ముంబై ఇండియన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బేషజాలు లేకుండా ఇద్దరూ కలిసి ఆడి ముంబైకి 6వ ట్రోఫీ అందించాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ ఐపీఎల్ లో హర్థిక్ పాండ్య కెప్టెన్సీలో హిట్ మ్యాన్ తొలిసారి ఆడబోతున్నాడు. అయితే, ప్రీ-సీజన్ కాన్ఫరెన్స్‌లో హర్థిక్ పాండ్య మాట్లాడుతూ.. రోహిత్ నిరంతరం ప్రయాణాలు చేయడం వల్ల అతడితో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదన్నారు. అతను జట్టులో చేరినప్పుడు తప్పకుండా కలుస్తానని తెలిపారు. ఇక, ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య M.A. చిదంబరం స్టేడియంలో జరగనుంది. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
𝟰𝟱 🫂 𝟯𝟯#OneFamily #MumbaiIndians | @hardikpandya7 @ImRo45 pic.twitter.com/eyKSq7WwCV
— Mumbai Indians (@mipaltan) March 20, 2024