మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) భారీ విజయాన్ని నమోదు చేసింది. 86 స్థానాల్లో ఫలితాలను ప్రకటించినప్పటికి.. ఆ పార్టీ 63 చోట్ల గెలిచినట్లు తెలిపగా.. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కొన్ని నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు చికిత్స పొందుతూ క్రమంగా మరణించే అవకాశం ఉందన్నారు.
అమరావతిలో వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి దీవిస్తే అభివృద్ధి పరంగా గన్నవరం రూపురేఖలు మారుస్తాను అని టీడీపీ- జనసేన- బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీ రామ నవమి సందర్భంగా కొంత కాలంగా నిలిపి వేసిన వీవీఐపీ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలను చేశారు. తన భార్య బుష్రా బీబీకి జైలులో టాయ్ లెట్ క్లీనర్ కలిపిన విషా ఆహారాన్ని ఇచ్చేవారిని పేర్కొన్నారు.