మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) భారీ విజయాన్ని నమోదు చేసింది. 86 స్థానాల్లో ఫలితాలను ప్రకటించినప్పటికి.. ఆ పార్టీ 63 చోట్ల గెలిచినట్లు తెలిపగా.. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే, మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్) లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం నాడు పోలింగ్ జరిగింది. మయిజ్జుకు చెందిన పీఎన్‌సీ, ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
Read Also: CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో నేడు రేవంత్ రెడ్డి పర్యటన
కాగా, మెజార్టీకి అవసరమైన సీట్లను ముయిజ్జు పార్టీ ఇప్పటికే గెల్చుకుంది. చైనాకు అనుకూలుడిగా ఉన్న ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. రిసెంట్ గా విడుదలైన ఫలితాలు ముయిజ్జు వైపే మొగ్గు చూపడాన్ని ప్రజలు సమర్ధించారు. పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడికి వారం రోజుల పట్టే ఛాన్స్ ఉండగా.. మే మొదటి వారంలో కొత్త పార్లమెంట్ కొలువుదీరే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేయగా.. కేవలం ముగ్గురు మాత్రమే గెలివగా.. ఈ ముగ్గురూ ముయిజ్జు పార్టీకి చెందిన అభ్యర్థులేనని స్థానిక మీడియా వెల్లడించింది.