మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈరోజు జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వైఖరి వల్ల ఇక్కడి రైతులు పేదలుగా మారారని తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన అవకాశాలు నాశనం అయ్యాయని తెలిపారు. దీంతో లక్షల మంది యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాడింది అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Yarlagadda VenkatRao: ఒక్కసారి అవకాశం ఇస్తే.. గన్నవరం రూపురేఖలు మారుస్తా..
ఇక, రాహుల్ గాంధీ మొదట అమేథీని వదిలి కేరళలోని వయనాడ్‌కు వెళ్లారని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు వయనాడ్‌లో కూడా ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ప్రిన్స్ ( రాహుల్ గాంధీ ) ఇప్పుడు వయనాడ్‌ని వదిలి మరో సురక్షిత సీటు కోసం వెతుకుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా టార్గెట్ చేశారు.. కొంత మంది నాయకులు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.. కానీ, ఈసారి రాజ్యసభ ద్వారానే ప్రవేశించారని పీఎం దుయ్యబట్టారు.
Read Also: Samsung : రూ.70వేల శాంసంగ్ 5జీ ఫోన్.. కేవలం రూ.30,000లలోపే.. త్వరపడండి
అయితే, విభజన బాధితుల కోసం సీఏఏ తీసుకొచ్చింది మన ప్రభుత్వమేనని ప్రధాని అన్నారు. CAA లేకపోతే మన సిక్కు సోదరులు, సోదరీమణులు ఏమై ఉండేవారు? అని ప్రశ్నించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది.. 1984 నాటి ఘటన వల్ల సిక్కులపై కాంగ్రెస్ ఇప్పటికీ ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది అని తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.