ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరగగా కోర్టు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 30వ తేదీకి రిజర్వ్ చేసింది.
ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై శుక్రవారం నాడు అర్థరాత్రి భారీ వైమానిక దాడులు జరిగాయి. బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న బాబిల్ ప్రావిన్స్‌లో అర్ధరాత్రి గుర్తు తెలియని విమానం రెండు ఇరాక్ సైనిక స్థావరాలపై బాంబు దాడి చేసింది.
జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ క్షిపణి వ్యవస్థకు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం సాంకేతిక వస్తువులను సరఫరా చేసే చైనా, బెలారస్ కంపెనీలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిషేధించింది.
బలమైన సైనిక వ్యవస్థతో పాటు ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా డ్రాగన్ కంట్రీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చూట్టింది.
వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాలను నమోదు చేస్తుంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై లక్ష్య ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.