ఎన్టీఆర్ జిల్లా మొత్తం సెక్షన్ IPC 144, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.. అపోహలకు పోయి ఎలాంటి గొడవలకు దారి తీయొద్దు.. అనుమానాలుంటే పోలీసు నంబర్లకు కాల్ చేయచ్చు అని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల కమిషన్ కు నిఘా వర్గాలు నివేదికను ఇచ్చాయి.
నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ గత మూడు రోజులుగా కొనసాగుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఇక, ఫ్రీ దర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరంలో గల ఈవీఎంలు భద్రత పరిచిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని నో మేన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మధవీ లత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ బలగాల ఆధీనంలో క్యాంపస్ ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకూ యూనివర్సిటీ బోధన, పాలనా కార్యకలాపాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.