భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు (జూన్ 9న) ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్ల జరుగుతున్నాయి. ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా రాహుల్ గాంధీ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. సాధారణంగా పార్లమెంటరీ పార్టీ లీడరే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారు.
18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఛాన్స్ ఉందని శుక్రవారం ఈ సమాచారాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఈ నెల మూడో వారంలో సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయని పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారాలు రెండ్రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నగీనా రిజర్వ్డ్ సీటు నుంచి ఎంపీగా గెలిచిన ఏఎస్పీ అధినేత చంద్రశేఖర్.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు తాను ఏం చేయగలిగితే అది శక్తివంతంగా చేశానని అన్నారు.
ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించొద్దని వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల్లో పేలవమైన పని తీరుకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఫడ్నవీస్ ఇంటికి సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అతుల్ లిమాయే పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ కు అత్యంత కీలక బాధ్యత దక్కే దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్ను నియమిస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది.
కొందరు ఓట్లు వేస్తున్నారు.. మరి కొందరు చెంపదెబ్బ కొడతారు అంటూ సంజయ్ రౌత్ తెలిపారు. తన తల్లి రైతుల నిరసనలో కూర్చున్న సమయంలో కంగాన చేసిన వ్యాఖ్యలతోనే ఆమెను చెంపదెబ్బ కొట్టినట్లు కానిస్టేబుల్ ఒప్పుకుందని పేర్కొన్నారు.