ఢిల్లీ నీటి ఎద్దడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ( గురువారం ) కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు 137 క్యూసెక్కుల నీటిని తక్షణమే ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్‌ను కోర్టు కోరింది.
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్న వేళ బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో చర్చిస్తున్నారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేలో ‘కింగ్ మేకర్’ హోదాను ఉపయోగించాలని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వీ యాదవ్ కోరారు.
హమాస్ మిలిటెంట్ల స్థావరాలున్న గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడుల్లో దారుణం జరిగింది. ఈ దాడుల్లో 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ మిలిటరీ ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి సీట్లు తగ్గడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. నిన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన రాష్ట్రంలో బీజేపీ పని తీరుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
ఖలిస్తాన్ సమస్యపై గతేడాది నుంచి భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక, కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో ఈ సంబంధాలలో మరింత ఉద్రిక్తతను సృష్టించాయి.
ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈరోజు తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో ఇవాళ ఉదయం సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్ దగ్గర కొందరు వ్యక్తులు ఖలిస్తాన్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పోస్టర్లను ప్రదర్శించారు.
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుతం మనుగడ కష్టతరంగా మారింది. సీట్లు తగ్గడం వల్ల జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు కూడా అప్రస్తుతం అవుతున్నాయి.