బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌పై గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో దాడి జరిగింది. సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఆమెపై ఫిర్యాదు చేయడంతో.. సదరు కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇక, విచారణ సందర్భంగా కుల్వీందర్ కౌర్ మాట్లాడుతూ.. రైతుల ఉద్యమం సమయంలో కంగనా చేసిన ప్రకటన తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించింది. ఇప్పుడు దీనిపై తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతుంది. కాగా, ఈ ఘటనపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు.
Read Also: Pushpa 2 : ‘పుష్ప 2’ కు తప్పని రీ షూట్స్ గండం.. కారణం అదేనా..?
కాగా, కొందరు ఓట్లు వేస్తున్నారు.. మరి కొందరు చెంపదెబ్బ కొడతారు అంటూ సంజయ్ రౌత్ తెలిపారు. తన తల్లి రైతుల నిరసనలో కూర్చున్న సమయంలో కంగాన చేసిన వ్యాఖ్యలతోనే ఆమెను చెంపదెబ్బ కొట్టినట్లు కానిస్టేబుల్ ఒప్పుకుందని పేర్కొన్నారు. ఆ ధర్నాలో కూర్చున్న ప్రతి ఒక్క మహిళ భారతమాతతో సమానంగా ఆ కానిస్టేబుల్ చూసిందని ఆయన అన్నారు. కంగనా రనౌత్ పట్ల మాకు సానుభూతి ఉంది.. అయినప్పటికీ రైతుల ఉద్యమం పట్ల ప్రజల్లో ఇంకా ఎంత ఆగ్రహం ఉందో ఈ ఘటన తెలియజేస్తోంది.. ఇక, కంగనా రనౌత్ కూడా ముంబైని పాకిస్తాన్ అని పిలిచారు అనే విషయాన్ని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ గుర్తు చేశారు.