భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరు కాబోతున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ప్రధాని మోడీ రేపు (జూన్12) ఉదయం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయి.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు రానున్నారు.
Read Also: Kalki 2898 AD : కల్కి నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అదిరిపోయాయిగా..
ఇక, ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత.. తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. రేపు ఒడిషా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉండడంతో.. ఆ కార్యక్రమంలోనూ సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని పాల్గొనబోతున్నారు. ఒడిషాలో దాదాపు పాతికేళ్ల తర్వాత అధికారం చేతులు మారింది. దీంతో బీజేపీ తొలిసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.