NDA Legislative Party: విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష సైతం జరిగింది. ఇందులో శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కూటమి ఎమ్మెల్యేలు పంపనున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
Read Also: Ram Pothineni : ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్..?
అలాగే, తెలుగుదేశం పార్టీ టీడీపీ శాసనసభా పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడిని పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడి పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.