Chandrababu Swearing In: రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Swearing In: టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. రేపు ఉదయం 10. 45 నుంచి 12. 45 గంటల వరకు విజయవాడలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉందనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.
Read Also: Harom Hara : గ్రాండ్ గా హరోం హర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులు ఎవరో తెలుసా ..?
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఇక, ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై ఇప్పటికే ఏపీ సీఎం నీరభ్ కుమార్ సమీక్ష జరిపారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో నిన్నే చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. వీఐపీల కోసం నాలుగు గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరీ మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేసరపల్లిలో కార్యక్రమం కావటంతో హైవేపై ఆంక్షలు విధించారు. ఇవాళ్టి సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి.
Read Also: TG TET 2024 Results: రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..
కాగా, తెలుగుదేశం- జనసేన- జేపీ పార్టీల నుంచి దాదాపు 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసిన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ తో కూడిన ఏర్పాట్లు చేశారు. అలాగే, పారిశుధ్యం, భద్రత, బారికేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజనం లాంటి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తుంది. మొత్తం 7 వేల మందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!