ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే, చిరుతపులి మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అక్కడే సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి.
Actor Suman: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది.. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించబోతున్నారు అని పేర్కొన్నారు.
AP CM: రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి రూ. 1000 పెంచాం.
KADAPA: కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగిన తర్వాత మొదటి ఆర్డీఓగా ఆకుల వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు.
Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు.