తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది అని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు.
MP Midhun Reddy: తిరుపతి జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ సిద్ధమైయ్యారు. అయితే, వైసీపీ పార్లమెంట్ సభ్యులు పర్యటనకు వెళ్తే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్ రెడ్డి పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.
Minister Parthasarathy: మాజీ మంత్రి వర్యులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రెడి అయ్యారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. జులై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ప్రకటించారు.
Nadendla Manohar: కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న క్షేత్ర స్థాయి పరిశీలనలో గోడౌన్ లలో ఉన్న రేషన్ బియ్యంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.