North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, జపాన్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది.
ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాల కోసం హాజరయ్యేందుకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తుల సౌకర్యార్ధం రైల్వేశాఖ 315 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.
Parliament: రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి లోక్సభ సమావేశాల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
New Criminal Laws: నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ రంగంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన కార్యచరణ రూపొందించాలి అని తెలిపారు.
ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు తెలిపారు. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సారిగా వెదర్ మారిపోయింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Polavaram: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల రంగం నిపుణులు నేటి నుంచి నాలుగు రోజుల పాటు పరిశీలించనున్నారు. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు.
Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారీ ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులుతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవీ విరమణ చేశారు.