Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామాలు..
- ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి.. రిజిస్ట్రార్ స్టీఫెన్ రాజీనామా..
- గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖ పంపిన వీసీ..
- ఇంచార్జీ రిజిస్ట్రార్ గా కిషోర్ బాధ్యతల స్వీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra University: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్ తమ పదవులకు రాజీనామా చేశారు.. గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖలు పంపినట్టుగా తెలుస్తోంది.. అయితే, రాజీనామాపై స్పందించేందుకు అందుబాటులోకి రావడం లేదు ప్రసాద్ రెడ్డి.. మరోవైపు.. రిజిస్ట్రార్ స్టీఫెన్ రాజీనామాకు ఆమోదం తెలిపారు.. దీంతో.. ఇంచార్జీ రిజిస్ట్రార్ గాకిషోర్ బాధ్యతలు స్వీకరించారు.. ఈ పరిణామాలతో వీసీ ఆఫీస్ ఎదుట బాణా సంచా పేల్చి.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఏయూ పూర్వ ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు. కాగా, ఇప్పటి వరకు ఏయూ వీసీగా ఉన్న పీవీజీడీ ప్రసాదరెడ్డి.. యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ పలు సందర్భాల్లో ఆరోపణలు చేశాయి.. రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేస్తూ వచ్చాయి..
Read Also: Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్‌లో వీడియో షేర్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
మరోవైపు.. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌కు ఆ మధ్యే బెదిరింపు కాల్స్ వచ్చాయి.. యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ఉన్న వీవీజీ ప్రసాద్ రెడ్డి , రిజిస్ట్రార్‌గా ఉన్న జేమ్స్ స్టీఫెన్.. తమకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. వెంటనే తమ పదవికి రాజీనామా చేసి.. తప్పుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారంటూ.. ఏయూ అధికారులు.. విశాఖ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. ఇక, ఏయూలో గోల్‌మాల్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి.. యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలను కూడా వీసీ వ్యాపారం చేశారని కొందరు ఆరోపించారు.. లక్షలాది రూపాయలు తీసుకుని పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారంటూ.. స్వయంగా వర్సిటీలో పనిచేసే ఓ సీనియర్ ప్రొఫెసర్ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!