Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో 450 రైళ్లు రద్దు..
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 450కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించగా.. మరో 13 రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. రద్దైన వాటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు పలు పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. -
Amavasya Effect: విజయవాడకి అమావాస్య గండం.. ఏం జరగబోతుంది..?
Amavasya Effect: విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది. ఈ అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నది. పోటు మీదుంటే వరదని తనలోకి సముద్ర ఇముడ్చుకోదు.. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు మరింత పెరిగే అవకాశం ఉందనే భయం మొదలైంది. -
Rescue Operation: బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..
Rescue Operation: బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొల్లూరు దిగువ భాగంలో ఉన్న లంక గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, ఎస్పీ తుషార్ డ్యూడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పర్యటించారు. -
Second Alert: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక.. రంగంలోకి 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
Second Alert: కృష్ణానది వరద నీటి ఉధృతితో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కలుగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. -
CM Chandrababu Review Meeting: మంత్రులు, అధికారులతో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu Review Meeting: మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కో డివిజన్ కేటాయింపు చేశారు. -
AP Governor: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ గవర్నర్ విజ్ఞప్తి..
AP Governor: భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు. -
Ramalingeswara Nagar: రామలింగేశ్వర నగర్లో భారీగా వరద.. రిటైనింగ్ వాల్ లీక్
Ramalingeswara Nagar: విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఏడోవ లైన్లో ఉన్న రిటైనింగ్ వాల్ లీక్ అవ్వడంతో కాలనీలోకి నీరు చేరింది. పోలీస్ కాలనీ వద్ద రిటైనింగ్ వాల్ లాక్స్ బ్రేక్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. ముంప్పు ప్రాంతాల వారిని పునానవాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. -
Power Boats In Vijayawada: ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. విజయవాడకు చేరిన పవర్ బోట్స్..!
Power Boats In Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ వచ్చాయి. దీంతో బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ కొనసాగుతుంది. -
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. రికార్డ్ స్థాయిలో వరద..!
Prakasam Barrage: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. -
Hyderabad-Vijayawada: మరోసారి నిలిచిన విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలు..
Hyderabad-Vijayawada: విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!