మొంథా తుపాను ఏపీ, తెలంగాణని వణికించింది. ఈదురుగాలులతో కుండపోత వర్షం కుమ్మేస్తోంది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. భీకర గాలులకు చరెల్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులకు వరద నీరు పోటెత్తింది.
AP Deputy CM Pawan: కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బ తిన్న వరి పొలాలను పరిశీలించారు.
Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యులు MS రాజు చేసిన వాఖ్యలపై మరో పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 5,125 సంవత్సరాల చరిత్ర కలిగిన భగవద్గీతను ఎంఎస్ రాజు అవహేళన చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
Cyclone Montha Effect: మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది.
Prakasam District: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 14 గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు నీటిని అధికారులు దిగువకు వదిలి పెడుతున్నారు. ఒక్కసారిగా అన్ని గేట్లు ఎత్తడంతో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాన్ తర్వాత పరిస్థితితో పాటు పంట నష్టంపై కాసేపట్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని ఎంపీ పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు లాంటి రంగాలలో అణు విజ్ఞానం, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అణు విద్యుత్ పరిశోధనలలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైనదని అన్నారు.
AP High Court: వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ కి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. వైద్య కళాశాలను పీపీపీకి ఇవ్వటం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
YS Jagan: మొంథా తుఫాను నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 30న) తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.