AP Govt: తెలంగాణ రాష్ట్రానికి చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వచ్చిన 698 మందిని.. గతంలో తెలంగాణకు పంపింది.
CM Chandrababu: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు క్రమ శిక్షణ గీత దాటుతున్న నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Minor Girl Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరంలో షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది.
East Godavari Floods: తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీ తదితర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడంతో గోకవరం కాలనీల్లో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Minister Anagani: రేపల్లెలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్ వరద ప్రభావంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఒక చరిత్ర.. గత ఆరు రోజులుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మైక్రో లెవల్లో పర్యవేక్షించారు.
Anakapalli: మొంథా తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో వందల ఎకరాల వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శారదా నది ఉప్పొంగడంతో యలమంచిలి నియోజకవర్గం ఎక్కువగా ప్రభావితమైంది. పంట వెన్ను వేసే సమయంలో శారదా నదికి గండి పడటంతో పంటలను వరద నీరు నిండా ముంచేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు.. విపత్తులు మన చేతిలో ఉండవు.. తుఫాన్ సమయంలో ప్రజలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది.. ప్రాణ, పశు, అస్థి నష్టం ఉండొద్దనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం కష్టపడి పని చేసింది.