Israel–Hamas war: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను చంపేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొనింది.
సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన నిందితులను ఎవరి కూడా వదిలి పెట్టేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు.
Char Dham Yatra: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు క్లోజ్ చేయనుండగా.. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తారు.
IPL 2025: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో తన సొంత గూటికి చేందుకు సిద్దమైనట్లు సమాచారం. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ఇటీవల కాలంలో దేశంలో మార్మోగిపోతుంది. ఈ సమయంలో ఒక కీలక పరిణామం జరిగింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి అమెరికా అలర్ట్ చేయడంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి.
ఈరోజు (శనివారం) తెల్లవారుజామునే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఇంటి దగ్గర జనం భారీగా గుమిగూడారు. బారామతిలోని ఆయన నివాసం ముందు జనం పూల బొకేలతో ఎదురు చూస్తున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతా పైన ఈ దాడులు జరిగాయి.
Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్ కు తరలిస్తున్నట్లు పేర్కొంది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ వైట్‌వాష్ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది.
Ind vs Pak: హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు శుభారంభం దొరకలేదు. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా రాబిన్ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది.