Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరణించిన నక్కలపల్లి రాములు, దామరగిద్ధ కృష్ణ, శ్యామల సుజాత, జమీల్ అనే నలుగురు మృదేహాలకు చేవెళ్ల టౌన్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేయనున్నారు. ఇక, ఈ ప్రమాదంలతో గాయపడిన ఆకుల పద్మమ్మ, బాలమణి, మోగులయ్యకి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోకరు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో, ఇంకో ఇద్దరు గాంధీ హస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.
Read Also: AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై ఫోకస్
కాగా, చేవెళ్లలోని ఆలూరు రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అమీర్ ను చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. పాతబస్తీ చంద్రయన్ గుట్ట ప్రాంతానికి చెందిన అమీర్ కొంతకాలంగా లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. షాక్ నుంచి కోలుకోగానే లారీ డ్రైవర్ అమీర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న చేవెళ్ల పోలీసులు. ఇక, సంఘటన స్థలం నుంచి లారీ తొలగించి చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తుండగా ఆలూరు గేట్ సమీపంలో ముందు ఆగి ఉన్న బస్సును ఓవర్టేక్ చేసిన లారీ.. అనంతరం ఓ టీ స్టాల్ ఢీ కొట్టి కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకు వెళ్లింది. ఆలూరు గేట్ వద్ద కూరగాయాలు అమ్ముకుని ఉపాధి పొందుతున్న నాలుగు కుటుంబాల్లో లారీ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది.