Canada: కెనడాలో పాలిటిక్స్ హీటెక్కింది. ప్రస్తుత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా, ఈ రేసులో ఇద్దరు భారత సంతతి నేతల పేర్లూ బాగా వినిపిస్తున్నాయి.
Read Also: AlluArjun : కిమ్స్ కు బయలుదేరిన అల్లు అర్జున్
ఇక, కొత్త నేతను లిబరల్ పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నా అని సోమవారం నాడు మీడియా సమావేశంలో జస్టిన్ ట్రూడో వెల్లడించారు. దీంతో అతడి స్థానంలో నెక్ట్స్ కొత్త నాయకుడిని ఎన్నుకునే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమైయ్యారు. ఈ క్రమంలో తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టీ క్లార్క్, క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీతో పాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.