Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో మరోసారి చైనా వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. డ్రాగన్ కంట్రీలో వెలుగు చూసిన కొత్త వైరస్ హెచ్‌ఎంపీవీ (HMPV) కేసులు భారత్‌లోనూ గుర్తించిన నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయితే, బెంగళూరులోని ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించడమే ఇందుకు కారణం. దీంతో సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,700 కనిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
ఈరోజు (జనవరి 6) మధ్యాహ్నం 12.20 గంటల సమయానికి సెన్సెక్స్ 959 పాయింట్ల నష్టంతో 78,263.97 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో 23,707.95 దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లూ భారీగా నష్టపోయాయి. టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
Read Also: NTRNEEL : ఎన్టీఆర్ – నీల్ సినిమాలో మలయాళ స్టార్ హీరోస్
కాగా, చైనాలో పెద్ద సంఖ్యలో హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు భారత్‌లోనూ నమోదు అవుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా సూచీలు ప్రారంభం కాగా.. బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ ఉందని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేపుతుంది. ఈ వార్తలు సూచీలను కిందకు పడేశాయి. ఇక, ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడం మన మార్కెట్లపై దాని ప్రభావం చూపిస్తుంది.
Read Also: Game Changer: యువకుల మృతి బాధాకరం.. ఆర్థికసాయం అందిస్తాం: పవన్ కల్యాణ్
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో చైనా సహా మరికొన్ని దేశాలపై పన్నూల భయం వెంటాడుతోంది. దీంతో జపాన్ నిక్కీ, హాంకాంగ్, షాంఘై షేర్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్ లాంటి అధిక వెయిటేజీ ఉన్న స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీల పతనానికి ప్రధాన కారణంగా చెప్పాలి. మరోవైపు ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండటం మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.