Om Birla: యూకే పర్యటనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లోని హైకమిషన్‌లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోందని తెలిపారు.
Tirupati Stampede: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన వార్త తెలిసి ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు. తొక్కిసలాట ఘటన నన్ను బాధించిందన్నారు.
MahaKumbh 2025: మహా కుంభమేళా ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 9) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో పర్యటించబోతున్నారు.
AAP vs BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. ఈ సమయంలో ‘ ముఖ్యమంత్రి బంగ్లా’ వివాదం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది.
వెటర్నరీ డాక్టర్ వీడియో కాల్ లో చెప్పిన సూచనలను పాటిస్తూ గోమాతకు ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కేఎంసీ వైద్య విద్యార్థులు. కాగా, ప్రసవం తర్వాత ఆవు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గోపాలమిత్ర సభ్యులు పేర్కొన్నారు.
Kerala High Court: మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్స్ చేయడం వారి గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు.
America: గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు.
BJP: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరిపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపైనే కాకుండా.. ప్రియాంకపైనా అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారానికి దారి తీసింది.
Fire Explodes: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్ ఏరియాలో కార్చిచ్చు చెలరేగినట్లు సమాచారం.
స్సాం రాష్ట్రంలోని దిమా హసావ్ జిల్లాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం నాడు తవ్వకాలు కొనసాగిస్తుండగా అకస్మాత్తుగా 100 అడుగుల మేర నీళ్లు ప్రవేశించాయి. దాంతో తొమ్మిది మంది కార్మికులు అందులో చిక్కుకొన్నారు. అయితే, వారిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు.