Sam Altman: ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు గుప్పించింది. దాదాపు పదేళ్ల పాటు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు మిస్సోరీ డిస్ట్రిక్ట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఈ దారుణాలను అనుభవించానని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్‌లు
కాగా, మిస్సోరీలోని క్లేటన్‌లో గల మా ఇంట్లోనే 1997 నుంచి 2006 వరకు ఈ వేధింపులను నేను ఎదుర్కొన్నాను అంటూ శామ్ ఆల్ట్‌మన్ సోదరి చెప్పుకొచ్చింది. ఈ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి గురియ్యాను అని తెలిపింది. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో అని ఆమె పేర్కొనింది. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆమె గతంలోనూ ఓసారి ‘ఎక్స్’ వేదికగా ఈలాంటి ఆరోపణలు చేసింది కూడా. అయితే, ఈసారి ఏకంగా కోర్టును ఆశ్రయించడంతో ఆయన విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Bangladesh: షేక్ హసీనా సహా 97 మంది పాస్‌పోర్టులు రద్దు..
అయితే, తన సోదరి ఆరోపణలను ఖండిస్తూ శామ్ ఆల్ట్‌మన్, ఆయన తల్లి, సోదరులు సంయుక్తంగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదు.. ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నామని వారు చెప్పుకొచ్చారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైందన్నారు. తనకు అండగా ఉండేందుకు తాము చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఆర్థికంగానూ సహాయంగా ఉన్నాం.. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం వేధిస్తుందని చెప్పారు. మా కుటుంబంపై, శామ్‌పై ఈలాంటి ఆరోపణలు చేసి బాధ పెడుతుందన్నారు. అయితే, ఆమె ఆరోగ్యంపై గోప్యతను మేం బయటకు చెప్పొద్దు అనుకున్నాం.. కానీ ఇప్పుడు ఆమె శామ్‌పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందని శామ్ ఆల్ట్‌మన్ కుటుంబసభ్యులు వెల్లడించారు.
My sister has filed a lawsuit against me. Here is a statement from my mom, brothers, and me: pic.twitter.com/Nve0yokTSX
— Sam Altman (@sama) January 7, 2025