Uttar Pradesh: ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య
- ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో బిచ్చగాడితో లేచిపోయిన భార్య..
- తమ ఆరుగురు పిల్లలను భర్త రాజు దగ్గర వదిలి వెళ్లిన భార్య రాజేశ్వరి..
- తన భార్యను బిచ్చగాడు నాన్ పండిట్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వివాహిత.. భర్త వద్ద ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయింది. దీంతో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం.. భర్త రాజు కంప్లైంట్ చేశాడు. అయితే, ఆ బిచ్చగాడిపై మహిళ అపహరణ కేసు ఫైల్ చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Also: Formula E Car Race Case : కోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు.. పలు చోట్ల తనిఖీలు
Also Read
కాగా, హర్దోయ్‌లోని హర్పల్ పూర్ లో జీవనం కొనసాగిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వరి అనే మహిళతో పెళ్లైంది. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే, నానే పండిత్ అనే బిచ్చగాడు వారి ఇంటి పరిసరాల్లో అడుక్కునేవాడు.. కొన్ని సందర్భాల్లో భార్య రాజేశ్వరితో అతను మాట్లాడుతు ఉండేవాడని రాజు తన కంప్లైంట్ లో తెలియజేశాడు. ఫోన్‌లో కూడా వారు పలుమార్లు సంభాషించినట్లు చెప్పుకొచ్చాడు.
Read Also: Formula E Car Race Case : బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చలు
అయితే, జనవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి.. కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్తున్నట్లు కూతురు ఖుష్బూకు భార్య రాజేశ్వరి చెప్పినట్లు ఫిర్యాదులో రాజు తెలిపాడు. ఎప్పటికి ఆమె తిరిగి రాకపోవడంతో భార్య కోసం వెతికాడు.. ఓ బర్రెను అమ్మితే వచ్చిన డబ్బులతో తన భార్య రాజేశ్వరి వెళ్లిపోయిందన్నాడు.. ఇక, భార్యను నానే పండిట్ అనే బిచ్చగాడు తీసుకెళ్లి ఉంటాడని రాజు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో నానే పండిట్ పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. ఆ చట్టం ప్రకారం నిందితుడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!