Delhi Election Schedule: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం.. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి.. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు. అతి త్వరలో ఒక బిలియన్ ఓటర్లకు చేరుకుంటామన్నారు. అందులో మహిళా ఓటర్లు 48 కోట్లకు పైగా ఉన్నారు. ఇక, ఓట్ల తొలగింపు ఆరోపణలను సైతం ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Rajinikanth: రిపోర్టర్‌పై ‘సూపర్ స్టార్’ అసహనం!
అలాగే, ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని చీఫ్ ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈవీలంతోనే పారదర్శకంగా ఫలితాలు వస్తాయి.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, ఈవీఎంలు రిగ్గింగ్ చేయడం కూడా సాధ్యం కాదు.. ఓటరు జాబితాను సిద్ధం చేసే ప్రతి దశలోనూ పాల్గొనే రాజకీయ పార్టీలకు పూర్తి సమాచారంతో పాటు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
Read Also: Daaku Maharaaj : తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో డాకు మహారాజ్ రిలీజ్
ఇక, ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా అందులో 58 జనరల్ స్థానాలు ఉన్నాయి. మరో 12 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే, మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 83. 49 లక్షలు, మహిళలు 71. 74 లక్షలు ఉండగా.. యంగ్ ఓటర్లు 25.89 వేల మంది ఉండగా.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 2.08 లక్షలు, వికలాంగులు 79, 436 మంది, వయోవృద్ధులు 830, ట్రాన్స్ జెండర్స్ 1261 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.