CM Chandrababu: నీతి అయోగ్ రిపోర్టుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటాం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.. అలాగే, ఆర్ధిక పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరగాలని తెలిపారు. పాలసీ మేకర్లు జాగ్రత్తగా పని చేయాలి.. నాయకుల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆయన వెల్లడించారు. అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Aham Brahmasmi: మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు.. ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ..
అయితే, నీతి ఆయోగ్ 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది అని సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి జరుగుతుంది.. సంక్షేమం చేస్తాం.. మళ్ళీ సంపద వస్తుంది.. ఇలా సైకిల్ తిరుగుతుంది అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించింది.. 2022- 23లో విపరీతంగా అప్పులు చేశారు.. అలాగే, గత సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బంతా ఏం చేశారో ఎటు మళ్లించారో తెలియడం లేదు.. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.