Ambati Rambabu: టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపై నలుగురిని అరెస్టు చేశారు.. జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎలాంటి ఆధారాలు లేవు.. పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు అని పేర్కొన్నారు. ఆవు నెయ్యి సరఫరాలో కూడా శాంపిల్ టెస్ట్ లు ఉంటాయి.. శాంపిల్ లో క్వాలిటీ లేకపోతే ఏ నెయ్యినీ తిరుమల కొండ పైకి అనుమతించరు.. గత ప్రభుత్వాలలో నాణ్యతా లేని అనేక సందర్భాలలో నెయ్యి వెనక్కి పంపారు.. వనస్పతి కలిసిందని అధికారులు చెప్తుంటే.. రాజకీయ లబ్ధి పొందాలని.. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారు.. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Bunny Vasu: కేసు ఫైల్ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !
అయితే, తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడారని ఒక్క చంద్రబాబే కాదు పవన్ కళ్యాణ్ అనవసర ఆరోపణలు చేశారని అంబటి రాంబాబు తెలిపారు. తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్దతి ఉంటుందన్నారు. ఏఆర్ సప్లైస్ వారు చంద్రబాబు సీఎంగా వచ్చాకే నెయ్యి సరఫరా చేశారు.. టెస్టుల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.. జగన్, చంద్రబాబు హయాంలో టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపారని మాజీ మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.
Read Also: Ambati Rambabu: రాజకీయ లబ్ది కోసమే లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు..
ఇక, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఏం చేస్తున్నారు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కేంద్రం నుంచి అప్పులు తెచ్చి అమరావతిలో రోడ్డులు వేయాలని చూస్తున్నారు.. సంక్షేమం అటకెక్కింది, ఆరోగ్య శ్రీకి డబ్బులు లేవు, ఇలా జరుగుతుందని వైసీపీ ముందే చెప్పింది.. నాలుగున్నర ఏళ్ళకు ఇంకో కొత్త డ్రామాతో చంద్రబాబు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మేనిఫెస్టో అమలు చేసిన జగన్.. ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అటకెక్కించిందని మండిపడ్డారు. పథకాల అమలుకు తొమ్మిది నెలల కాలంలోనే ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం.. ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.