Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మరి కొందరి ప్రమేయంపై సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆరా తీస్తుంది. గత రాత్రి అరెస్టు చేసిన నలుగురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. బోలె బాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Laila: పృథ్వి రాజ్ కామెంట్స్ కలకలం.. షైన్ స్క్రీన్స్ కీలక ప్రకటన
అయితే, నలుగురు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని తిరుపతి న్యాయస్థానంలో సిట్ టీమ్ పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తులో లభించిన కీలక ఆధారాలతో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇక, 2020లో తమిళనాడు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలో తనిఖీల కోసం వెళ్లిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాగా, ఇప్పటికే టీటీడీకి చెందిన పలువురు సిబ్బందికి విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారిలో 10 మందికి పైగా అందుబాటులో లేరని సమాచారం. అయితే, ఆ తర్వాత తదనంతర దర్యాప్తులో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనే అంశంపై సీట్ బృందం సమావేశమైంది.