PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (ఏప్రిల్ 11న) వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆయన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలుకనున్నారు.
ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చారు.
US-China Trade War: చైనా దిగుమతులపై 125 శాతం పన్నులను అగ్రరాజ్యం అమెరికా విధించింది. ఈ టారిఫ్లపై బీజింగ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాము చైనీయులం.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొన్నారు.
WhatsApp image scam: సైబర్ నేరస్థులు నిరంతరం సరికొత్త పద్దతులతో మోసాలకు పాల్పడుతున్నారు. లింక్స్, మెసెజెస్, కాల్స్ ద్వారానే కాకుండా మరో కొత్త రకం మోసానికి దిగుతున్నారు సైబర్ నేరగాళ్లు. స్కామర్లు వాట్సాప్, ఇతర మెసిజింగ్ యాప్స్ ద్వారా ఫోటోలను పంపించి.. ఇందులో స్టెగానోగ్రఫీ అనే టెక్నాలజీతో ప్రమాదకరమైన లింక్ లను యాడ్ చేస్తారు.
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సెంగుట్టైలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం రావడంతో క్లాస్ రూమ్ బయట కూర్చొని సైన్స్ పరీక్ష రాయవలసి పరిస్థతి వచ్చింది.
Kangana Ranaut: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ బ్రిటిష్ వలసవాద వారసత్వం, గతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ పార్టీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఆశాంతి, భయానక వాతావరణం ఉండేదని తెలిపింది.
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగు నీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది.
US-EU Trade War: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర టారిఫ్ లు విధించారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు- అల్యూమినియంపై సుమారు 25 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు.