WhatsApp image scam: సైబర్ నేరస్థులు నిరంతరం సరికొత్త పద్దతులతో మోసాలకు పాల్పడుతున్నారు. లింక్స్, మెసెజెస్, కాల్స్ ద్వారానే కాకుండా మరో కొత్త రకం మోసానికి దిగుతున్నారు సైబర్ నేరగాళ్లు. స్కామర్లు వాట్సాప్, ఇతర మెసిజింగ్ యాప్స్ ద్వారా ఫోటోలను పంపించి.. ఇందులో స్టెగానోగ్రఫీ అనే టెక్నాలజీతో ప్రమాదకరమైన లింక్ లను యాడ్ చేస్తారు. ఈ ఫోటోలను మనం డౌన్ లోడ్ చేసుకోగానే.. వారి ఫోన్ క్రాష్ అయ్యేలా రూపొందించారు. తాజాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తికి ఇలాగే, తెలియని నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ఒక ఫోటోను పంపగా.. అతడు ఆ పిక్చర్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో సుమారు 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ రకమైన సైబర్ నేరం గురించి టెలికాం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారులు జర ఫైలంగా ఉండాలని సూచించింది.
Read Also: AA22xA6 : అల్లు అర్జున్-అట్లీ మూవీలో ఆ హీరోయిన్‌ను లాక్ చేసేశారా..?
స్కామ్ విధానం..
స్కామర్లు వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఫోటోలను పంపడం ద్వారా ఈ మోసం స్టార్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో, వాట్సాప్ లో పంపిన ఫోటోలోని వ్యక్తిని గుర్తించమని ఫోన్ కాల్స్ కూడా చేస్తారని సైబర్ నిపుణులు తెలిపింది. ఇక, బాధితుడు ఆ ఫోటోలను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వారి ఫోన్ పూర్తిగా క్రాష్ అవుతుంది.. దీని వలన స్కామర్లు బాధితుడి స్మార్ట్‌ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది అన్నారు. కాబట్టి, పెరుగుతున్న టెక్నాలజీతో స్కామర్లు ఓటీపీ, నకిలీ లింక్స్ కాకుండా.. ఇప్పుడు ఈ ఫోటోలలో లింక్‌లను దాచి పెడుతున్నారని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: Tamil Nadu: పరీక్ష టైమ్ లో 8వ తరగతి విద్యార్థినికి పీరియడ్స్.. ప్రిన్సిపాల్ చేసిన పనికి అంతా షాక్!
స్టెగానోగ్రఫీ అంటే ఏమిటి?
అయితే, కాస్పెర్స్కీ ప్రకారం.. స్టెగానోగ్రఫీ అంటే మరొక సందేశం లేదా భౌతిక వస్తువులో సమాచారాన్ని దాచి పెట్టి గుర్తించకుండా తప్పించుకునే పద్ధతి అని అర్థం వస్తుంది. టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు లేదా ఆడియోతో సహా వివిధ రకాల డిజిటల్ కంటెంట్‌ను దాచడానికి ఈ స్టెగానోగ్రఫీని ఉపయోగిస్తారు. ప్రస్తుతం స్కామర్లు ఈ సాంకేతికతను ఉపయోగించి బాధితుడి దగ్గర నుంచి భారీగా డబ్బును కాజేస్తున్నారని సైబర్ పోలీసులు వెల్లడించారు.
Read Also: Amit Shah: చిన్ననాటి ముద్దు పేరును బయటపెట్టిన అమిత్ షా
స్టెగానోగ్రఫీ స్కామ్ నుంచి ఇలా బయట పడొచ్చు..?
* వాట్సాప్ సెట్టింగ్స్ లో ఆటో డౌన్ లోడ్ ఆప్షన్ నను డిసేబుల్ చేసుకోవాలి..
* గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోటోలు, వీడియోలు, ఆడియో రికార్డులను ఎట్టి పరిస్థితుల్లో డౌన్ లోడ్ చేయొద్దు..
* అనుమానిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు స్పందించొద్దు.. వాటిని వెంటనే బ్లాక్ చేయాలి..
* వాట్సాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి..
* మీ వాట్సాప్ నంబర్‌ను మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేయవద్దు..
* ఒకవేళ ఫోటోలు డౌన్ లోడ్ చేశాక ఫోన్ లో మార్పులు కనిపిస్తే 1930లో సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి: సైబర్ నిపుణులు