Extramarital Affairs: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ లో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక జంట లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారియా గ్రామానికి చెందిన గీత అనే వివాహితకు ఐదుగురు పిల్లల ఉన్నారు.. ఇక, అదే గ్రామానికి చెందిన గోపాల్ కి నలుగురు పిల్లల ఉన్నారు.. వీరి మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగింది. ఇక, పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదే తడువుగా ఇరువురు.. తమ జీవిత భాగస్వాములను, మొత్తం తొమ్మిది మంది పిల్లలను వదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. ఆ ఫోటోను ఏప్రిల్ 5వ తేదీన గోపాల్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Read Also: Israel: అమెరికా రాయబారిగా మైక్ హకబీ నియామకం.. నెతన్యాహు అభినందనలు
ఇక, గోపాల్ ఫేస్‌బుక్ ఖాతాలో పెళ్లి ఫోటోలు చూసిన గ్రామస్తులు వాటిని గీత భర్త శ్రీచంద్ కు, గోపాల్ భార్యకు చూపించారు. దీంతో రెండు కుటుంబాలలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. గీత అత్తమామలుమాట్లాడుతూ.. తమ కుటుంబంలో విభేదాలు రావడంతో మా కొడలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని అనుకున్నామన్నారు.. కానీ, ఇలా నా కొడుకును మోసం చేసి మరో వ్యక్తితో లేచిపోవడం దారుణం అన్నారు. మా కొడుకు ముంబైలో వడ పావ్ అమ్మి తమ కుటుంబాన్ని పోషించాడని చెప్పుకొచ్చారు. ఇక, గీత భర్త శ్రీచంద్ మాట్లాడుతూ.. నేను కష్టపడి సంపాదించిన రూ.90 వేల డబ్బు, బంగారం తీసుకుని పారిపోయిందని ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు.
Read Also: Vontimitta: రేపే ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించునున్న సీఎం..
అలాగే, గోపాల్ భార్య మాట్లాడుతూ.. నా భర్త “చనిపోయాడని” ప్రకటించింది. గోపాల్ ఎక్కడైనా జీవించవచ్చు, కానీ నా పిల్లలు భవిష్యత్ కోసం అతడి ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక, పిల్లల పెంపకం కోసం ఆయన ఆర్థికంగా బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. కాగా, ఈ ఘటనపై సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనుజ్ సింగ్ మాట్లాడుతూ.. గోపాల్- గీత లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలుసు.. కానీ, దీనిపై ఇంకా ఎటువంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. ఈ విషయంపై మాకు ఏదైనా ఫిర్యాదు అందితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.