MLA Raja Singh: జనాలను రెచ్చగొట్టడానికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీటింగ్ పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఈ రోజు మీటింగ్ లో నిజం చెప్పు అని అడిగారు.
CM MK Stalin: 2026లో తమిళనాడులో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిప్పికొట్టారు. మా తమిళనాడు రాష్ట్రం ఎప్పటికీ ఢిల్లీ నియంత్రణలో ఉండదని అన్నారు.
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పరిధిలో గల గాంధీ నగర్ లో చోటు చేసుకుంది. వినయ్ అనే యువకుడు చందన అనే హిజ్రా వెంట పడి వేధిస్తున్నాడని ఆరోపణ వచ్చాయి.. ఆ హిజ్రాను పెళ్లి చేసుకుంటాను లేకపోతే రైలు కింద పడి చనిపోతానంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వినయ్.
Minister Narayana: స్వచ్చ ఆంధ్ర స్వర్ణాంధ్ర కోసం అందరూ సహకారం అందించాలని మంత్రి నారాయణ కోరారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.. కానీ, మన రాష్ట్రంలో చంద్రబాబు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
Tirumala: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కలియుగ వైకుంఠం కిక్కిరిసిపోయింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు.
Building Collapses: దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Crime In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నాడు మూడు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది.