Transgender Marriage: భారతదేశంలో వివాహ బంధం చాలా గొప్పది. అలాంటిది కొందరు చేసే పిచ్చి పనులతో ఈ బంధం విలువ క్రమంగా తగ్గిపోతుంది. కొంత మంది అటు అమ్మాయిలను, ఇటు అబ్బాయిలను వదిలి పెట్టి హిజ్రాల వెంట పడుతున్నారు. సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ.. వెర్రీ చేష్టలతో తమలోని పైత్యాన్ని బయటకు వ్యక్త పరుస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు హిజ్రా వెంట పడి మరి పెళ్లి చేసుకుంటాను అంటూ వేధింపులకు గురి చేశాడు.
Read Also: Pooja Hegde : ఆ ఫీలింగ్ చాలా మిస్ అవుతున్నాను..
ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పరిధిలో గల గాంధీ నగర్ లో చోటు చేసుకుంది. వినయ్ అనే యువకుడు చందన అనే హిజ్రా వెంట పడి వేధిస్తున్నాడని ఆరోపణ వచ్చాయి.. ఆ హిజ్రాను పెళ్లి చేసుకుంటాను లేకపోతే రైలు కింద పడి చనిపోతానంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వినయ్.. దీంతో అతడి చర్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన హిజ్రాలు.. సదరు యువకుడి ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగారు. వినయ్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చందన వెంట పడకుండా చూడాలని హిజ్రాలు కోరుతున్నారు.